Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్య పరిష్కరించాలని తడగొండ రైతుల వినతి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 4:07 PM రాజన్న సిరిసిల్లGeneral
విద్యుత్ సమస్య పరిష్కరించాలని తడగొండ రైతుల వినతి - Udayam
బోయిన్‌పల్లి మండలం తడగొండలో నెల రోజులుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మల్కాపూర్ సబ్‌స్టేషన్ నుంచి కరెంటు తరచూ ట్రిప్ అవుతుండటంతో మోటర్లు కాలిపోతున్నాయని రైతులు తెలిపారు. విద్యుత్ సమస్యతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ప్రజావాణిలో విద్యుత్ ఏఈకి వినతిపత్రం అందించారు.

Comments

G
Loading comments...