Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనుల పండుగగా రేణుక ఎల్లమ్మ జాతర

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 11, 2026 12:04 PM కర్నూలుGeneral
కనుల పండుగగా రేణుక ఎల్లమ్మ జాతర - Udayam
ఆదోని శివారు కొండ గుహలోని శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఆషాఢ మాసం చివరి మంగళవారం సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, ఆకు పూజ నిర్వహించారు. భక్తులు బోనాలు, టెంకాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు.

Comments

G
Loading comments...