వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగో నదిలో రెండు మోటారు పడవలు ఢీకొనడంతో కనీసం 30 మంది మృతి చెందారు. ఈక్వటర్ ప్రావిన్స్‌లోని న్‌గోంబే-లుకోలేలా ప్రాంతంలో ఆదివారం రాత్రి ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదంలో పలువురు గల్లంతైనట్లు వెల్లడించారు. వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

