వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా టేక్మాల్ మండలానికి చెందిన లింగంపల్లి సువిక్ష నందన 2 నెలల 13 రోజుల వయసులో ‘బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించింది. నిటారుగా ఉన్న స్థితిలో తలను పైకి ఎత్తడం, ఇరువైపులా సులువుగా తిప్పడం వంటి అరుదైన శారీరక సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
చిన్నారి తల్లిదండ్రులు రజిత, జనార్ధన్ వ్యవసాయ శాఖలో అధికారులుగా పనిచేస్తున్నారు. తమ కుమార్తె సాధించిన ఘనతపై వారు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

