వార్తలకు తిరిగి వెళ్లండి
ఎస్ఐ సస్పెన్షన్ ఎత్తివేయాలి

కోరుట్ల ఎస్ఐ చిరంజీవిని ఎలాంటి విచారణ జరుపకుండా సస్పెండ్ చేయడం సరికాదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యకు వినతిపత్రం అందజేశారు.
సునీత ఫిర్యాదును అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోకుండా ఎస్ఐని సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని వారు కోరారు.
Comments
Loading comments...