Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు రోజుల వర్షంతో వెదపొలాలకు ఊరట

Follow Udayam on Google
భరత్ తేజ Jul 29, 2026 10:59 AM కృష్ణా జిల్లాGeneral
రెండు రోజుల వర్షంతో వెదపొలాలకు ఊరట - Udayam
వర్షాభావంతో ఎండిపోతున్న వెదపొలాలకు గత రెండు రోజులుగా కురిసిన వర్షం ఊరటనిచ్చింది. పొలాల్లో తేమ పెరగడంతో పంట కొంతవరకు కోలుకుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 27న 20.7, 28న 12.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఇప్పటికే 26 వేల హెక్టార్లలో వెదసాగు చేపట్టగా, ఈ వర్షాలు పంటకు మేలు చేస్తాయని వ్యవసాయ వర్గాలు పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...