వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ఆర్‌అండ్‌బీ భవనంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం (ఏఐబీఎస్‌ఎస్) జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా యువజన అధ్యక్షుడు ఇందల్ నాయక్ అధ్యక్షత వహించారు.
ఆరు సంవత్సరాలుగా ఎస్టీ కార్పొరేషన్ నిధుల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని జిల్లా అధ్యక్షుడు రామావత్ మోహన్ నాయక్ ఆరోపించారు. వెంటనే నిధులు విడుదల చేయాలని, లేకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

