వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని కొండమల్లేపల్లిలో ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా మండలంలో నిరసన తెలిపారు.
సీపీఎస్ వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యుడు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

