Udayam Digital
Menu

రేవంత్ హామీలపై వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు

Manjunath Nov 20, 2026 2:43 PM హైదరాబాద్General
రేవంత్ రెడ్డి మానసిక స్థితిపై అర్థం కావడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చారని అన్నారు. కేబినెట్‌లోనే మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని, ముందు వాటిని భర్తీ చేయాలని సూచించారు. ప్రస్తుతం ఖాళీలను నింపలేక రెండేళ్ల తర్వాతి ఎన్నికల గురించి హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

Comments

G
Loading comments...