వార్తలకు తిరిగి వెళ్లండి

లబ్ధిదారులకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఈ నెల 5 వరకు కొనసాగుతుందని తహశీల్దార్ సునీత తెలిపారు. మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పలువురు లబ్ధిదారులు బియ్యం తీసుకోకపోవడంతో మరో 5 రోజులపాటు పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్లు పేర్కొన్నారు.
అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

