Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు తాండూరులో పాఠశాలలు బంద్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 20, 2026 5:25 PM వికారాబాద్General
రేపు తాండూరులో పాఠశాలలు బంద్ - Udayam
నల్గొండ నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్యకు నిరసనగా రేపు తాండూరులో పాఠశాలల బంద్ పాటించాలని TRSMA తాండూరు శాఖ పిలుపునిచ్చింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని, విద్యావేత్తలకు భద్రత కల్పించాలని సంఘం అధ్యక్షులు మోహన్ కృష్ణ గౌడ్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లు ధరించి, మౌనం పాటించి నివాళులర్పించాలని, బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...