వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట పట్టణం పెద్దవీధిలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొలువైన శ్రీ నూకాంబికా దేవి 23వ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్లు అర్చకులు ఇప్పలి రమణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మంగళవారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలతో అభిషేకాలు, విశిష్ట పూజలు నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నప్రసాద వితరణ ఉంటుందని, భక్తులు పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

