వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి సీతక్క మంగళవారం కామారెడ్డి పట్టణానికి రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సందీప్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని శిథిలావస్థకు చేరిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నూతనంగా నిర్మించనున్న నేపథ్యంలో నిర్వహించే భూమిపూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని చెప్పారు.
మంత్రితో పాటు పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరుకానున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

