Udayam Digital
Menu

రేపు భారత్‌కు నేపాల్ ప్రధాని

Shruthi Nov 21, 2026 6:34 AM అంతర్జాతీయంGeneral
రేపు భారత్‌కు నేపాల్ ప్రధాని - Udayam Digital
నేపాల్ ప్రధానమంత్రి బాలేన్ షా ఈ నెల 22 నుంచి రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన వస్తున్నట్లు నేపాల్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు ఇదే తొలి అధికారిక విదేశీ పర్యటన. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీతో బాలేన్ షా సమావేశమవుతారు. ద్వైపాక్షిక సంబంధాలు, ఇంధన సహకారం, అనుసంధానతపై చర్చించనున్నారు.

Comments

G
Loading comments...