Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేకుర్తిలో ఎలుగుబంటి సంచారం: భయాందోళనలో స్థానికులు

Follow Udayam on Google
sudheer Sep 06, 2026 12:09 PM కరీంనగర్General
కరీంనగర్ రేకుర్తిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఎలుగుబంటి సంచరిస్తుండటంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. గుట్టల్లోంచి వచ్చిన ఎలుగుబంటిని చూసి జనం కేకలు వేయడంతో అది తిరిగి కొండపైకి వెళ్లిపోయింది. ఇటీవల ఇది ఒక ఇంటి రేకులపైకి సైతం ఎక్కింది. జనావాసాల్లోకి తరచూ వస్తున్న ఎలుగుబంటిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలేయాలని అటవీ అధికారులను స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...