Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భానుడి భగభగ: తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్

Follow Udayam on Google
Ravi Singh May 30, 2026 12:43 PM నల్గొండGeneral
భానుడి భగభగ: తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ - Udayam
తీవ్రమైన వడగాల్పుల నేపథ్యంలో మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Comments

G
Loading comments...