Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు జడ్పీ హైస్కూళ్లలో పోస్టుల భర్తీ

Follow Udayam on Google
రవళి దేవి Aug 14, 2026 6:26 PM కోనసీమGeneral
నాలుగు జడ్పీ హైస్కూళ్లలో పోస్టుల భర్తీ - Udayam
ఆత్రేయపురం మండలంలోని నాలుగు జడ్పీ హైస్కూళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నట్లు పి. వరప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి, తెలిపారు. పేరవరం, వాడపల్లి, లొల్ల, ర్యాలి పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయని శుక్రవారం వెల్లడించారు. ఎంపికైన వారికి నెలకు రూ.12,500 వేతనం అందజేస్తారని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19లోగా ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...