వార్తలకు తిరిగి వెళ్లండి
శస్త్ర చికిత్స అనంతరం వేగంగా కోలుకుంటున్నా: వైఎస్ షర్మిల

ఇటీవల ఉదర శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాను వేగంగా కోలుకుంటున్నట్లు 'ఎక్స్' వేదికగా తెలిపారు.
ఈ సమయంలో తన ఆరోగ్యం గురించి ఆరా తీసి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన శ్రేయోభిలాషులు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రార్థనలు, ఆత్మీయత తనకు ఎంతో అండగా నిలిచాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...