Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రౌడీ షీటర్లకు ఎస్సై నాగార్జున కౌన్సిలింగ్

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Aug 30, 2026 12:14 PM నంద్యాలGeneral
రౌడీ షీటర్లకు ఎస్సై నాగార్జున కౌన్సిలింగ్ - Udayam
ప్యాపిలి: రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ప్యాపిలి ఎస్సై నాగార్జున సూచించారు. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్సై సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత పద్ధతులను మానుకొని మంచిగా మెలగాలన్నారు

Comments

G
Loading comments...