Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ కార్డుదారులకు ఊరట: అవన్నీ పుకార్లే

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 21, 2026 10:14 AM రంగారెడ్డి General
రేషన్ కార్డుదారులకు ఊరట: అవన్నీ పుకార్లే - Udayam
'SIR' (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) నమోదు చేసుకోకపోతే రేషన్ కార్డు రద్దవుతుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రంగారెడ్డి జిల్లా డిసిఎస్ఓ వనజాత ఖండించారు. అవన్నీ కేవలం అసత్య ప్రచారాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ ఓటు హక్కు రక్షణ కోసం స్వచ్ఛందంగా SIR నమోదు చేసుకోవాలని కోరారు. తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని, కేవలం అధికారిక ప్రకటనలనే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...