వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైని కుండపోత వర్షాలు, వరదలు ముంచెత్తడంతో నగర జీవనాడి అయిన 'డబ్బావాలా' సేవలు సోమవారం తాత్కాలికంగా నిలిచిపోయాయి. రవాణాకు ప్రధాన ఆధారమైన సబర్బన్ రైలు సర్వీసులు నిలిచిపోవడం, పలు ప్రాంతాలు జలమయం కావడంతో సిబ్బంది భద్రత దృష్ట్యా అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
విరార్-వసాయి ప్రాంతంలో పలువురు డబ్బావాలాల ఇళ్లలోకి వరద నీరు చేరిందని, రైల్వే స్టేషన్లు నీట మునిగాయని అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉల్హాస్ ముకే తెలిపారు. వినియోగదారులకు కలిగిన అంతరాయానికి ఆయన క్షమాపణలు ప్రకటించారు.
Comments
Loading comments...

