Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామయ్య మాన్యంలో ఆక్రమణల పర్వం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 17, 2026 11:17 AM ఖమ్మంGeneral
రామయ్య మాన్యంలో ఆక్రమణల పర్వం - Udayam
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన వందలాది ఎకరాల మాన్యపు భూములు అక్రమార్కుల పాలవుతున్నాయి. ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్న 800 ఎకరాల రాముడి భూమిలో యథేచ్ఛగా వందలాది అక్రమ షెడ్లు, ఇళ్లు వెలుస్తున్నట్లు తేలింది. ఉభయ రాష్ట్రాల పరిధిలోని 1,347 ఎకరాల ఆలయ భూముల్లో సుమారు 1,100 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. 2018 నుండి కౌలు చెల్లించకుండా కోట్ల రూపాయల బకాయిలు పెట్టారని, ఆక్రమణలను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...