వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ నియోజకవర్గంలోని డోన్, బేతంచర్ల, ప్యాపిలి మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. దీంతో కరువు పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఊరట లభించనుంది.
రైతులకు సుమారు రూ.220 కోట్ల మేర ఇన్సూరెన్స్ పరిహారం అందే అవకాశం ఉందని ఏడిఏ సునీత, ఏవో శ్రీనివాస్‌రెడ్డి డోన్ ఎమ్మెల్యే కోట్లకు వివరించారు. పరిహారం త్వరగా అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

