Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఈ-లాటరీ ద్వారా 37 ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 02, 2026 3:43 PM గుంటూరుGeneral
రైతులకు ఈ-లాటరీ ద్వారా 37 ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపు - Udayam
అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన 17 మంది రైతులకు బుధవారం రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో ఈ-లాటరీ ద్వారా 37 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 24 నివాస, 13 వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. గతంలో వీధిపోటు, కోర్టు కేసులు మరియు భూసేకరణ ఎదురైన ప్రాంతాల్లో ప్లాట్లు పొందిన రైతుల విజ్ఞప్తులను పరిశీలించి, అర్హులైన వారికి ఈ ప్రత్యామ్నాయ ప్లాట్లను కేటాయించినట్లు సీఆర్డీఏ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...