వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరువుల కోసం వచ్చే రైతులను ఇబ్బంది పెట్టరాదని తాండూరు ఏడీఏ అరుణ దుకాణ యజమానులను ఆదేశించారు. పెద్దేముల్‌లో తనిఖీలు చేపట్టిన ఆమె, దుకాణాల్లో ధరల పట్టిక, స్టాక్ వివరాలు ప్రదర్శించాలని, రైతులకు రశీదులు ఇవ్వాలని స్పష్టం చేశారు.
రైతు వేదికలో 50% సబ్సిడీతో కంది, పెసర, మినుము విత్తనాలు పంపిణీ చేశారు. యూరియా కొరత లేదని, పెద్దేముల్ సొసైటీలకు సరిపడా బస్తాలు వస్తున్నందున రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు.
Comments
Loading comments...

