వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ డిమాండ్ చేశారు.
డోన్, ప్యాపిలి మండలాల్లో పంట పొలాలను పరిశీలించిన ఆయన, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని కోరారు. కరువు మండలాలుగా ప్రకటించి రుణమాఫీ, తాగునీరు, పశుగ్రాసం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

