వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావ పరిస్థితులతో రైతుల ఆదాయం తగ్గకుండా ప్రత్యామ్నాయ పంటలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయనగరం కలెక్టరేట్లో వ్యవసాయ పరిస్థితులపై సమీక్షించారు.
ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే వేసిన సుమారు లక్ష ఎకరాల వరి పంటను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, పంటల బీమాపై చైతన్యపరచాలని ఆదేశించారు.
Comments
Loading comments...

