వార్తలకు తిరిగి వెళ్లండి

ఖేడ్ మండల రైతులకు 12 గంటల విద్యుత్ సరఫరా చేసి పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని మాజీ జడ్పీటీసీ రవీందర్‌నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. లో-వోల్టేజీ, సరఫరాలో అంతరాయాలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ శాఖ అధికారులు రైతులకు ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా సరఫరా చేయాలని కోరారు. పంటలు దెబ్బతినకుండా తక్షణమే విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
Comments
Loading comments...

