వార్తలకు తిరిగి వెళ్లండి

‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం ద్వారా భూ యజమానులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేసి వారి హక్కులకు భద్రత కల్పిస్తున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. గురువారం మందస మండలం సువర్ణపురంలో పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు.
మందస మండలంలోని ఆరు గ్రామాల్లో మొత్తం 3,143 పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. తహశీల్దార్ బి.శ్రీహరి, ఎంపీడీవో వై. వెంకటరమణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

