Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు రిజిస్ట్రేషన్‌కు సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 4:26 PM హన్మకొండ General
రైతు రిజిస్ట్రేషన్‌కు సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం - Udayam
నడికూడ మండలంలో 88% మంది రైతుల రిజిస్ట్రేషన్‌ పూర్తయిందని మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్‌ తెలిపారు. మిగిలిన రైతులు సెప్టెంబర్‌ 30లోగా వ్యవసాయ విస్తరణ అధికారులు లేదా మీ-సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. రైతు IDతో పంటల కొనుగోలు, ఎరువుల బుకింగ్‌, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు పొందవచ్చన్నారు. ఆధార్‌, పట్టా పాస్‌బుక్‌, లింకైన మొబైల్‌ అవసరమని తెలిపారు.

Comments

G
Loading comments...