రైతు భరోసా నిధుల విడుదలపై కీలక సమాచారం

రైతు భరోసా కింద తెలంగాణ ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ.12,000ను రెండు విడతల్లో ఇస్తోంది. యాసంగి సీజన్ సమీపిస్తుండటంతో రైతులు నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. గత వానకాలంలో పంటలు సాగు చేసిన వారికే సాయం అందింది.
ఎల్‌నినో, సాగునీటి కొరతతో ఈసారి పంట వేయని అర్హులకూ సాయం ఇవ్వడంపై ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తయ్యే డిసెంబర్ 7న నిధులు విడుదల చేయవచ్చని తెలుస్తోంది.
Comments
Loading comments...
