Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు తెలంగాణలో వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్

Follow Udayam on Google
Ravi Shukla May 28, 2026 12:02 PM నల్గొండGeneral
నేడు తెలంగాణలో వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్ - Udayam
తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నేడు సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని అంచనా వేశారు. మరోవైపు రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో 43-45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో 40-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండవచ్చని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...