Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుతుపవనాల రాక.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Follow Udayam on Google
Ravish Kumar May 28, 2026 6:15 PM హైదరాబాద్General
రుతుపవనాల రాక.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - Udayam
దేశవ్యాప్తంగా ఎండల తీవ్రతతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఆగ్నేయ అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో రానున్న కొద్దిరోజుల్లో ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కేరళలో ప్రవేశించిన వారం రోజుల్లోనే రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని IMD తెలిపింది. దీనివల్ల రెండు రాష్ట్రాల్లో ముందస్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...