వార్తలకు తిరిగి వెళ్లండి

మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపడంలో గుంటూరు రైల్వే డివిజన్ అరుదైన మైలురాయిని చేరుకుంది. సెప్టెంబర్ 3న నూరు శాతం సమయపాలన (పంక్చువాలిటీ) పాటించి రికార్డు సాధించింది. గుంటూరు డివిజన్ ఈ ఘనత సాధించడం ఇది 12వ సారి కావడం విశేషం.
అంకితభావంతో శ్రమించి ఈ ఘనత సాధించిన సిబ్బందిని రైల్వే ఉన్నతాధికారులు ప్రశంసించారు.
Comments
Loading comments...

