వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉండి సస్పెండైన అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇళ్లపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో హైదరాబాద్, సూర్యాపేట సహా మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టారు.
ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న భుజంగరావుతో పాటు ఆయన బంధువుల నివాసాల్లోనూ అధికారులు సోదాలు చేశారు. భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లు సమాచారం.
Comments
Loading comments...

