Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్తంగా పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:09 PM గుంటూరుGeneral
రాష్ట్రవ్యాప్తంగా పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు - Udayam
ఈ నెల 25న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్ల మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళగిరిలో ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు. 1 నుంచి 19 ఏళ్ల బాలబాలికలకు అంగన్‌వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో మాత్రలు అందించనున్నారు. బడికి వెళ్లని పిల్లలకూ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...