వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రంగరాజు ముదిరాజ్‌కు ఘన సన్మానం.

వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండల కేంద్రంలోని లక్ష్మారెడ్డి గార్డెన్‌లో ఆదివారం రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ కే. రంగరాజు ముదిరాజ్‌ను మండల ముదిరాజ్ సంఘం, బీసీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రంగరాజు ముదిరాజ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలనలోని ఇందిరమ్మ రాజ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు సంతోషంగా జీవిస్తున్నారని, తెలంగాణ దేశంలోనే అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోందని అన్నారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని రంగరాజు పేర్కొన్నారు.
Comments
Loading comments...