Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన చైనా బృందం

Follow Udayam on Google
madhu Aug 25, 2026 7:24 PM ములుగుGeneral
రామప్ప దేవాలయాన్ని సందర్శించిన చైనా బృందం - Udayam
వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని మంగళవారం చైనాకు చెందిన ఐదుగురు పర్యాటకులు సందర్శించారు. వారికి అర్చకులు హరిశ్ శర్మ, ఉమాశంకర్ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ గురించి టూరిజం గైడ్ వెంకటేష్ వివరించారు. అనంతరం రామప్ప చెరువులో బోటింగ్ చేశారు. వారి వెంట టూరిస్ట్ పోలీసులు, టూరిజం శాఖ సిబ్బంది ఉన్నారు.

Comments

G
Loading comments...