వార్తలకు తిరిగి వెళ్లండి

రాయపోల్ మండలం రామారం వద్ద గజ్వేల్–చేగుంట రహదారిపై రైతులు రోడ్డుపై బైఠాయించారు. నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, విద్యుత్ కోతలతో పంటలు పండే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించాలని రైతులు కోరారు. విద్యుత్ సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

