వార్తలకు తిరిగి వెళ్లండి
గుమ్మలక్ష్మీపురం మండలం మంత్రజొల గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డు పనులు సగంలోనే నిలిచిపోయి తారు వేయకపోవడంతో వర్షాలు కురిసిన ప్రతిసారీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాళ్లు తేలిన రోడ్డుపై రాకపోకలు కష్టతరంగా మారాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తారు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

