వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల మండలం కుంచాల కూర్మయ్యపేట గ్రామంలో కొలువై ఉన్న దేవి ఆశ్రమంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సతీసమేతంగా దర్శించుకున్నారు.
శ్రావణ శుక్రవారం సందర్భంగా స్థానిక ఆశ్రమంలో చేపట్టిన పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఒక మంచి రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రసాదాన్ని ఆయనకు అర్చకులు అందజేశారు.
Comments
Loading comments...

