రాజీనామాతో తొలగింపు ప్రక్రియ నిరర్థకం: జస్టిస్ వర్మ

రాజీనామాతో తనను తొలగించే ప్రక్రియ నిరర్థకమైందని, దానికి రాజ్యాంగ ప్రాతిపదిక లేదని జస్టిస్ యశ్వంత్ వర్మ అన్నారు. తనపై మూడు ఆరోపణలూ నిరాధారమని, రాజీనామాను నేర అంగీకారంగా చూడరాదని లేఖలో పేర్కొన్నారు.
అయితే, స్పీకర్ నియమించిన కమిటీ మూడు ఆరోపణలూ నిరూపితమయ్యాయని ఆగస్టు 12న పార్లమెంటుకు నివేదించింది. వర్మ లేఖను ఎంపీలకు పంపినట్లు సమాచారం. గతేడాది మార్చిలో ఆయన ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది.
Comments
Loading comments...
