Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజారాంపల్లిలో పొలాల అమావాస్య వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 11:38 AM జగిత్యాలGeneral
రాజారాంపల్లిలో పొలాల అమావాస్య వేడుకలు - Udayam
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో తోటి కుల సంఘం ఆధ్వర్యంలో పొలాల అమావాస్య వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు కంద మొక్కను పొలాలమ్మగా భావించి ప్రత్యేక పూజలు చేసి, బూరెలు, గారెలు తదితర నైవేద్యాలను సమర్పించారు. సంతానం, పిల్లల ఆయురారోగ్యాలు, కుటుంబ సౌభాగ్యం కోసం అమ్మవారిని ప్రార్థించారు. మహిళలు, సంఘ నాయకులు, తోటి సంఘీయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...