వార్తలకు తిరిగి వెళ్లండి

చల్లపల్లి రాధానగర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి మురుగునీరు రోడ్లపైనే నిలిచిపోతోంది. దీంతో తీవ్ర దుర్గంధం వెదజల్లడంతో పాటు దోమలు విపరీతంగా విజృంభించి, రోగాల బారిన పడే ప్రమాదం ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు.
దీనికితోడు పందుల స్వైరవిహారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీని శుభ్రం చేసి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Comments
Loading comments...

