Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురపాలక సంఘాల్లో గుదిబండగా పన్నుల బకాయిలు

Follow Udayam on Google
Reporter.Bharath Sep 19, 2026 1:00 PM గుంటూరువాణిజ్యం
పురపాలక సంఘాల్లో గుదిబండగా పన్నుల బకాయిలు - Udayam
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పురపాలక సంఘాల్లో పన్నుల బకాయిలు గుదిబండగా మారాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో ఏకంగా రూ.258 కోట్ల మేర ఆస్తి పన్నులు పేరుకుపోయాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో రూ.220 కోట్లు బకాయిలు ఉన్నాయి. నిధులు లేక కాంట్రాక్టర్లకు బిల్లులు, కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. బకాయిల వసూలుపై అధికారులు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Comments

G
Loading comments...