Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరర్‌గడ్డలో పులి సంచారంపై రైతుల్లో ఆందోళన

Follow Udayam on Google
రాజేష్ Aug 19, 2026 11:50 AM మెదక్General
నరర్‌గడ్డలో పులి సంచారంపై రైతుల్లో ఆందోళన - Udayam
టేక్మాల్‌ మండలం నరర్‌గడ్డ పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు ప్రచారం కావడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పొలాల్లో పులి పాదముద్రలు కనిపించినట్లు స్థానికులు తెలిపారు. గొల్లగూడెం రైతు కుర్మ నవీన్‌ పొలానికి వెళ్లగా పులి వెంటపడిందని పేర్కొన్నారు. ఈ ఘటనతో రైతులు అప్రమత్తమయ్యారు. పులి సంచారాన్ని అటవీశాఖ అధికారులు నిర్ధారించి, తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...