వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశాన్ని వణికించిన 2019 పుల్వామా ఉగ్రదాడిలో కీలక సూత్రధారి, అల్-బదర్ ఉగ్రవాద సంస్థ కమాండర్ హంజా బుర్హాన్ (అర్జుమండ్ గుల్జార్ దార్) హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని దుండగులు అతడిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
భారత జవాన్లపై దాడికి ఉగ్రవాదులకు పేలుడు పదార్థాలు, గ్రెనేడ్లు సరఫరా చేయడంలో ఈ 'డాక్టర్' అలియాస్ హంజా కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్‌లో టీచర్‌గా, స్కూల్ ప్రిన్సిపాల్‌గా నటిస్తూ ఇన్నాళ్లూ తలదాచుకున్న ఈ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని 'అజ్ఞాత వ్యక్తులు' పక్కా ప్లాన్‌తో లేపేయడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది.
Comments
Loading comments...

