వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీలో పల్స్ పోలియో: ఈ నెల 28న వ్యాక్సినేషన్
నిహారిక రెడ్డి Jun 24, 2026 5:06 AM అమరావతి 8 viewsabout 19 hours ago

ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఐదేళ్లలోపు 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు.
గతంలో వేయించుకున్నప్పటికీ, ఐదేళ్ల లోపు పిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ తప్పనిసరి. కేంద్రాల్లో వేయించుకోని వారికి తర్వాతి రెండు రోజులు ఇంటింటి సర్వే ద్వారా వ్యాక్సిన్ అందిస్తారు.
Comments
Loading comments...