వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల సమీప కొండ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు హెచ్చరించారు. దీంతో గజ్జరం, పోచవరం, తుపాకులగూడెం, రాగోలపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు.
బుధవారం అటవీశాఖ అధికారులు, తహసీల్దార్ లక్ష్మీలావణ్య పర్యవేక్షణలో గాలింపు చేపట్టారు. పులిని పట్టుకునేందుకు కెమెరాలు, బోనులు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రజలు బయటకు రావద్దని టామ్‌టామ్ ద్వారా హెచ్చరించారు.
Comments
Loading comments...

