Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులి భయం: కూలీలకు రైతుల కాపలా

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 8:19 AM ఆదిలాబాద్General
పులి భయం: కూలీలకు రైతుల కాపలా - Udayam
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో పెద్దపులి సంచారంతో రుయ్యాడి, సికినాపూర్ గ్రామాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో పొలాలకు వెళ్లేందుకు కూలీలు జంకుతుండటంతో, రైతన్నలే కర్రలతో కాపలాగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు చుట్టూ రక్షణగా ఉండి శబ్దాలు చేస్తూ భరోసా కల్పిస్తేనే కూలీలు పొలాల్లో సోయా పంటకు రసాయన మందు పిచికారీ చేయడానికి ముందుకు వస్తున్నారు.

Comments

G
Loading comments...